ECB : స్వదేశంలో భారత మహిళల జట్టుతోపొట్టి సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్‌కు బిగ్ షాక్. సిరీస్‌లో వెనకబడిన ఆ జట్టు కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) సేవల్ని కోల్పోనుంది. ఎడమ వైపు గజ్జ భాగంలో గాయం కావడంతో ఆమె మూడో టీ20 ఆడలేదు. స్కానింగ్ పరీక్షల అనంతరం బ్రంట్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో, తదుపరి రెండు మ్యాచ్‌లకు టమ్మీ బ్యూమంట్ సారథ్యం వహించనుంది.
‘స్కానింగ్ తర్వాత బ్రంట్ మిగిలిన రెండు టీ20లకు దూరమైంది. నాలుగు, ఐదో మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్యూమంట్ చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును నడిపించనుంది. బ్రంట్ స్థానంలో మైయా బుచియర్ స్క్వాడ్‌లో చేరుతుంది. అయితే.. వన్డే సిరీస్‌లోపు బ్రంట్ కోలుకుంటుందని ఆశిస్తున్నాం’ అని శుక్రవారం ఇంగ్లండ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
England captain Nat Sciver-Brunt, who was ruled out of the third game due to a groin injury, will also miss the remaining two T20Is against India. She is expected to be fit for the three-match ODI series; Maia Bouchier will replace her in the T20I squad https://t.co/YED5OlGlFY… pic.twitter.com/kzNY7afv1D
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025
తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లండ్ సిరీస్‌లో కీలకమైన మూడో పోరులో గెలుపొందింది. బ్యూమంట్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్ సోఫియా డంక్లే(75), వ్యాట్ హొడ్గే(66)లు అర్ధ శతకాలతో శుభారంభం ఇచ్చారు. వీరిద్దరి జోరుతో భారీ స్కోర్ దిశగా సాగిన ఇంగ్లండ్‌ను దీప్తి శర్మ(3-27), అరుంధతి రెడ్డి(3-32)లు దెబ్బకొట్టారు. తెలుగమ్మాయి శ్రీచరణి కూడా రెండు వికెట్లతో రాణించగా భారత్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఛేదనలో స్మృతి మంధాన(56) హాఫ్ సెంచరీతో మెరవగా.. షఫాలీ వర్మ(47) సైతం ఖతర్నాక్ బ్యాటింగ్‌తో చెలరేగింది. అయితే.. మిడిలార్డర్ వైఫల్యంతో 5 పరుగుల తేడాతో భారత్‌కు చెక్ పెట్టింది ఇంగ్లండ్. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జూలై 9న జరుగనుంది. పొట్టి ట్రోఫీ అనంతరం భారత్, ఇంగ్లండ్ మూడు వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి.