Tree Felling | చర్లపల్లి, జూలై 5 : చర్లపల్లి డివిజన్ శివసాయినగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా అటవీశాఖ అధికారిణి రేణుక పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మర్రిచెట్టు, తాడిచెట్టును నరకడంతో నిరసనగా సీసీఎస్, కాలనీవాసుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఆందోళనలో భాగంగా జిల్లా అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఆమె సంఘటనా స్థలానికి చెరుకొని వివరాలు సేకరించి పంచానామా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెట్లను నరికివేసేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేయడం సరికాదన్నారు. జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. శివసాయినగర్‌లో చెట్లను నరికివేయడంతో పక్షులు మృతి చెందాయని, చెట్లను నరికివేసిన వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షుడు, శివసాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు ఎంపెల్లి పద్మారెడ్డి, కాలనీ ప్రతనిధులు కొండగళ్ల ఆశోక్, బింగి బిక్షపతి, కందుల సత్యనారాయణ, షాబాద్ దామోదర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సరికొండ రమేశ్, సత్యనారాయణ, గోపాల్‌కృష్ణ, గోపాల్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు