కొల్లాపూర్: డీడీలు కట్టిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ( Transfarmers ) అందించకపోతే విద్యుత్ సబ్స్టేషన్లను ( Substations ) ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harsavardan Reddy ) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొల్లాపూర్నియోజకవర్గానికి చెందిన రైతులతో కలిసి శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రానిన సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. వానాకాలం సీజన్ ప్రారంభైన కూడా రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయడం లేదన్నారు. రైతులకు రైతు భరోసా సరిగ్గా అందడం లేదని ఆరోపించారు.
శాటిలైట్ కారణంగా దాదాపు 6వేల మంది సన్నకారు రైతులకు రైతు భరోసా వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వేరుశెనగ పంట సాగు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్లను అందించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు మండలా రైతులకు ట్రాన్స్ఫార్మర్ల అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు.