ఆలేరు టౌన్, జులై 05 : జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆలేరు పట్టణంలో రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పకీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్లాట్లను చూపించలేకపోయిందన్నారు.
ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలన్నారు. ఇందిరమ్మ గృహ పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కుళ్ల సిద్దులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ నరేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మొహమ్మద్ నబి పాల్గొన్నారు.