IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఎట్టకేలకు బోణీ కొట్టింది. తమ సొంత మైదానంలో రెచ్చిపోయిన ముంబై 8 వికెట్ల తేడాతో కోల్‌కతాకు పెద్ద షాకిచ్చింది. అయితే.. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రేయసిగా చెప్పబడుతున్న జాస్మిన్ వలియా (JasmineWalia) మీడియా కంట పడింది.
బ్రిటన్ సింగర్, టీవీ నటి అయిన జాస్మిన్‌తో పాండ్యా లవ్‌లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబై టీమ్ బస్సులో ప్రయాణించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం ఈ ముద్గుగుమ్మ రోహిత్ శర్మ భార్య రితికా సచ్దేహ్తో కలిసి ముంబై బస్సు ఎక్కింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు, వాళ్ల భార్యలు, ప్రేయసిల కోసం ప్రత్యేకంగా బస్సులు కేటాయించాయి. మ్యాచ్‌లు జరిగే స్టేడియాలకు వీళ్లను సురక్షితంగా తీసుకువెళ్లడానికి ముంబై యాజమాన్యం కూడా స్పెషల్ బస్ ఏర్పాటు చేసింది. వాంఖడేలో ముంబై జట్టు కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన తర్వాత.. రితిక, ఇతరులతో కలిసి జాస్మిన్ ముంబై టీమ్ బస్సు వద్దకు చేరుకుంది. పోలీసుల బందోబస్తు నడమ ఆమె ఫ్రాంచైజీ బస్సు ఎక్కుతున్న వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వీడియో చూసినవాళ్లంతా .. ‘నో డౌట్.. పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నిరుడు భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు పాండ్యా, వెస్టిండీస్ నుంచి ట్రోఫీతో స్వదేశం వచ్చాక.. అతడు భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చాడు. నాలుగేళ్ల తమ అనుబంధం ముగిసిందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడీ ఆల్‌రౌండర్. ఆ బ్రేకప్ తర్వాత మళ్లీ పాండ్యా ప్రేమల్ పడ్డాడనే వార్తలు వినిపించాయి.
బ్రిటన్ గాయని జాస్మిన్‌కు మనసు ఇచ్చాడనే కథనాలు వచ్చాయి. కానీ, భారత స్టార్ మాత్రం అధికారికంగా జాస్మినెతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించలేదు. కానీ, ఈమధ్య టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌కు హాజరైన జాస్మిన్.. స్టాండ్స్‌లో కూర్చొని పాండ్యాను ఎంకరేజ్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ముంబై టీమ్ బస్సులతో తను ప్రత్యక్ష్యం కావడంతో.. ‘వీళ్లు ప్రేమలో పడ్డారు.. జంట పక్షుల్లా తిరుగుతున్నారు’ అని అనుకుంటున్నారంతా.