MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఏప్రిల్ 1: హిందూ స్మశాన వాటికను పరిరక్షిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం హిందూ స్మశాన వాటిక పరిరక్షణ నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. స్మశాన వాటికను కబ్జా నుండి రక్షించడానికి చేస్తున్న పోరాటానికి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. స్మశాన వాటికను ఆక్రమించి డంప్ యార్డుగా మార్చడం హేయమైన చర్య అని విమర్శించారు. మచ్చ బొల్లారంలోని హిందూస్మశాన వాటికను పరిరక్షించడానికి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు.
చట్టబద్ధంగా స్మశాన వాటికను అప్పగించేంతవరకు పోరాడుతామని మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న, రమేష్, అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి