Hockey Asia Cup : భారత్, పాకిస్థాన్ల మధ్య క్రీడా సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల బోర్డులు అంతర్జాతీయ టోర్నీల్లోనే ఒకే గ్రూప్లో ఆడేందుకు నిరాకరించడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే భారత్ ఈ ఏడాది ఆతిథ్యమిస్తున్న హాకీ ఆసియా కప్ (Hockey Asia Cup)లో పాక్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం తమ జట్టును ఇండియాకు పంపించేందుకు సిద్ధమవుతోంది.
హాకీ ఆసియా కప్ టోర్నీ భారత్ వేదికగా ఆగస్ట్ 27న ప్రారంభం కానుంది. స్టెపెంబర్ 27 వరకూ జరుగబోయే ఈ ఈవెంట్కు హాకీ ఇండియా సన్నాహకాలు చేస్తోంది. టోర్నమెంట్ సమీపిస్తున్న వేళ గురువారం పాకిస్థాన్ క్రీడా మంత్రిత్వ శాఖ భారత్కు తమ జట్టును పంపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ‘భారత్ వేదికగా జరుగబోయే పలు దేశాల టోర్నీలో మేము ఏ జట్టుకు వ్యతిరేకం కాదు. ఇదేమీ ద్వైపాక్షికి సిరీస్ కాదు. అంతర్జాతీయ క్రీడా నిబంధనలు మాకు తెలుసు.
Pakistan hockey team will compete in Asia Cup in India next monthhttps://t.co/qo3dvUVZO6#Pakistan #Hockey #AsiaCup2025 #Rajgir #Bihar #IndiaPakistanWar #AsiaCup pic.twitter.com/P0Q9ury3Vp
— NewsDrum (@thenewsdrum) July 3, 2025
అందుకే మా జట్టును పోటీలకు పంపేందుకు అడ్డు చెప్పం. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్నా సరే ఆ దేశాల జట్లు పలు వేదికలపై పోటీ పడ్డాయి. కాబట్టి.. పాక్ జట్టుకు ఆసియా కప్ ఆడేందుకు అనుమతిస్తున్నాం’ అని పాక్ క్రీడా శాఖ సన్నహిత వర్గాలు తెలిపాయి. అయితే.. సెప్టెంబర్లో టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్లో దాయాదులు తలపడుతాయా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపై బీసీసీఐ అభిప్రాయం వెలిబుచ్చాకే తమ మాట చెప్పాలని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు సమాచారం.