Shubman Gill : సుదీర్ఘ ఫార్మాట్లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనతో టెస్టు సారథిగా ఎంపికైన గిల్.. విమర్శకులకు బ్యాటింగ్‌తో బదులిస్తూ వరుసగా రెండో శతకంతో అలరించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో జట్టును పటిష్ట స్థితిలో నిలిపిన అతడు రెండో రోజు అంతే ఏకాగ్రతతో ఆడి 150 పరుగులతో మరో రికార్డు నెలకొల్పాడు. స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి గిల్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. తద్వారా ఇంగ్లండ్ మీద 150 ప్లస్ కొట్టిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడీ యంగ్‌స్టర్.
ఇంగ్లండ్‌పై అత్యధిక స్కోర్ బాదిన కెప్టెన్ ఎవరంటే… అజారుద్దీన్. ఈ డాషింగ్ బ్యాటర్ 1990లో ఈ ఫీట్ సాధించాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ఉతికేస్తూ అతడు179 రన్స్ బాదాడు. ఇప్పటికీ ఇంగ్లండ్ గడ్డపై భారత కెప్టెన్అత్యుత్తమ స్కోర్ ఇదే. అయితే.. ఈ మ్యాచ్‌లో గిల్ లెజెండ్ అజారుద్దీన్ రికార్డు బద్ధలు కొట్టడం లాంఛనమే అనిపిస్తోంది.
He is here to SET RECORDS 🔥
Highest score for an Indian captain in England in Tests
🔹179 – Mohammed Azharuddin, Manchester, 1990
🔸150* – Shubman Gill, Birmingham, 2025
🔹149 – Virat Kohli, Birmingham, 2018
🔹148 – Mansur Ali Khan Pataudi, Leeds, 1967#ShubmanGill #INDvsENG pic.twitter.com/gS9OTJwEIS— Bugs Bunny 🐰 (@bunnyhumai) July 3, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భారత కెప్టెన్ గిల్ పరగుల వరద పారిస్తున్నాడు. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తనదైన షాట్లతో 147 రన్స్ కొట్టిన గిల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి రోజే వందతో ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన భారత సారథి.. రెండోరోజు 150కి చేరువయ్యాడు. బ్రాండన్ కార్సే ఓవర్లో బౌండరీ బాదిన గిల్ 148తో తన అత్యధిక స్కోర్‌ను అధిగమించాడు. ఆ తర్వాత బషీర్ బౌలింగ్‌లో సింగిల్‌తో 150 క్లబ్లో చేరాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా(73 నాటౌట్) అర్ధ శతకంతో మెరవగా.. భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది.