Mass shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. చికాగో (Chicago)లోని ఓ నైట్‌క్లబ్ (nightclub)పై దుండగులు కాల్పులకు (Mass shooting) తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు.
చికాగోలోని రివర్ నార్త్ పరిసరాల్లో గల ఆర్టిస్ లాంజ్ నైట్‌క్లబ్ (Artis Lounge nightclub) వెలుపల బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు చికాగో పోలీసులు తెలిపారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నైట్‌క్లబ్ బయట నిలబడి ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 16 మంది గాయపడినట్లు చికాగో పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Benjamin Netanyahu | హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం : ఇజ్రాయెల్ ప్రధాని
Dalai Lama | వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే ఉంది : భారత్
India-US | తుది దశలో చర్చలు.. 48 గంటల్లో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్..!