మునుగోడు, జూలై 03 : మునుగోడు మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన మహాసభలో మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పెరుమాళ్ల రాజు, బుడిగపాక లింగస్వామి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటుగా 17 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్మికులకు యూనిఫామ్స్, సబ్బులు, నూనెలను అందించాలన్నారు.
చెత్త ఎత్తడానికి గ్లౌజెస్, షూస్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గౌరవ సలహాదారుగా లింగయ్య యాదవ్, సహాయ కార్యదర్శిగా జీడిమెట్ల దశరథ లక్ష్మయ్య, ఉపాధ్యక్షులుగా ఆర్ సంజీవా, సహాయ కార్యదర్శి, .ట్రెజరర్‌గా అండాలు, అరుణ, పెద్దమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.