Peddamma Temple | బంజారాహిల్స్, జూలై 3 : జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సప్తశతి పారాయణం, దేవతాహవనాలు, రుద్రాభిషేకం, దేవీ భాగవత పారాయణం, సాయంత్రం శ్రీ పెద్దమ్మతల్లి పల్లకీ సేవ తదితర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి శాకంబరీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.