Jagityal | జగిత్యాల, జూలై 03 : జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గోరింటాకు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు ఉత్సాహంగా పాటలు పాడుతూ గోరింటాకు వేడుకల్లో పాల్గొన్నారు. గోరింటాకు ఉత్సవం అనాదిగా వస్తున్న ఆచారం అని, వర్షాకాలంలో మహిళలు వివిధ ఇన్ఫెక్షన్ లకు గురికాకుండా ఉండేందుకు ఆరోగ్యపరంగా గోరింటాకు ఎంతో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వప్న, రమ, స్రవంతి, స్వరూప, కవోష్ణ, కవిత, వర్షిని, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.