Operation Sindoor : వర్షాకాల సమావేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై చర్చలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీల ఎంపీల వ్యాఖ్యలకు దీటుగానే బదులిచ్చిన ప్రధాని బృందం రాజ్య సభ (Rajya Sabha)లోనూ అదే ధోరణి అవలంభించాలనుకుంది. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం రాజ్య సభలో కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. బుధవారం చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది.
ప్రధాని మోడీ సభకు వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్, ఇతర విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే అందకు తిరస్కరించిన షా ప్రధాని అన్ని విషయాలు సవివరంగా చెప్పారని బదులిచ్చారు. దాంతో, ఆగ్రహించిన కాంగ్రెస్, సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీల తీరును కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘సభలో ప్రధాని లేకపోవడం పార్లమెంట్‌కే అవమానకరమని ఆయన మండిపడ్డారు. ‘ప్రధాన మంత్రి సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ ఆవరణలోనే ఉండి మోడీ సభకు రాకుంటే అది ఈ సభకే అవమానం’ అని ఖర్గే అన్నారు.
The Opposition in Rajya Sabha walked out, demanding Prime Minister Modi address the House on “Operation Sindoor.” Leader of Opposition Kharge ji deemed Modi’s absence an insult.#MallikarjunKharge #AmitShah #NarendraModi #MonsoonSession2025 pic.twitter.com/vzytxHxGa0
— With Congress (@WithCongress) July 30, 2025
ఖర్గే వ్యాఖ్యలపై డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ స్పందిస్తూ.. ‘ప్రభుత్వం తరఫున ఎవరైనా మంత్రి సమాధానమిస్తారని నేను మీకు ఇదివరకే చెప్పాను. ఇదే రూలింగ్. మీరు ఎవరినీ బలవంతం చేయకూడదు’ అని చెప్పారు. ఆ తర్వాత షా మాట్లాడుతూ.. ఖర్గేను వాళ్ల సొంత పార్టీ ఎంపీలే మాట్లాడనివ్వడం లేదని సెటైర్లు వేశారు. ‘నేను చెప్పేది వినండి. మోడీ వచ్చారంటే మీకే మరింత కష్టమవుతుంది’ అని షా ప్రతిపక్ష నేతలకు చురకలు అంటించారు.