ECB : తమ దేశంలో నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ (The Hundred League)లో ఫ్రాంచైజీల వాటా కొనుగోలుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. లీగ్‌లోని ఆరుజట్లతో సదరు ఫ్రాంజైజీల డీల్‌కు ఈసీబీ అధికారికంగా అంగీకరించింది. మరో రెండు జట్ల వాటా కొనుగోలుపై మాత్రం నిర్ణయాన్ని వెలువరించలేదు. వీటిలో భారత్‌కు చెందిన రిలయన్స్ సంస్థ (Reliance Group), ఓవల్ ఇన్విజిబుల్ క్లబ్ మధ్య కుదరాల్సిన డీల్ కూడా ఒకటి. ఓవల్ క్లబ్లో 49 శాతం వాటా కోసం రిలియన్స్ బిడ్డింగ్ వేసింది.
ది హండ్రెడ్ లీగ్‌లోని ఆరు జట్లలో ఏ ఫ్రాంఛైజీలు ఎంత వాటా కొన్నాయంటే.. భారత్‌కు చెందిన జీఎంఆర్ గ్రూప్ (GMR Group) సౌతాంప్తన్ సూపర్ ఛార్జర్స్‌లో 49 శాతం వాటాను దక్కించుకుంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ (త్వరలోనే మాంచస్టర్ సూపర్ జెయింట్స్‌గా పేరు మారనుంది) జట్టులో 70 శాతం షేర్‌ను సంజీవ్ గొయెంకాకు సంబంధించిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్ చార్జర్స్‌లో వంద శాతం వాటాను సొంతం చేసుకోగా.. బర్మింగ్హమ్ ఫీనిక్స్‌లో 49 శాతం వాటాను నైట్‌హెడ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కొన్నది. వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ వెల్ష్ ఫైర్‌లో 50 శాతం వాటాను సంపాదించింది.
4 IPL OWNERS CONFIRMED FOR THE HUNDRED LEAGUE
Oval Invincibles – Reliance Group.
Northern Supercharges – Sun TV.
Manchester Originals – RPSG Group.
Southern Brave – GMR Group.IndianSportsFans
20:21HRS#GautamGambhir #BenStokes #AsiaCup2025 #Tsunami #INDvsENGTest #AsiaCup pic.twitter.com/jZ0FMgUDoY— Indian Sports Fans. Fan Curated & Original (@IndianSportFan) July 30, 2025
లియోనార్డ్ కర్టిస్ క్రికెట్ ఆర్ధిక నివేదిక ప్రకారం ఇంగ్లండ్‌లోని మూడు ప్రధాన క్లబ్స్‌కు.. చిన్నాచితకా క్లబ్స్ మధ్య దూరం పెరుగూతూ వస్తోంది. సర్రే, ల్యాంక్‌షైర్, వార్విక్షైర్ క్లబ్స్కే 44 శాతం ఆదాయం సమకూరుతోంది. నార్తంప్టన్‌షైర్, లీసెస్టర్‌షైర్, డెబ్రిషైర్ వంటి చిన్న క్లబ్స్ మాత్రం ఆదాయం లేక అల్లాడుతున్నాయి. ది హండ్రెడ్ లీగ్‌లో 8 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందని ఇంగ్లండ్ క్లబ్స్ ధీమాతో ఉన్నాయి.
టీ20 ఫార్మాట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ఐపీఎల్ (IPL)ను మించిన లీగ్ ప్రపంచంలోనే లేదని చెప్పొచ్చు. మన దేశంలోనే కాదండోయ్.. విదేశాల్లోనూ సిస్టర్ ఫ్రాంచైజీలతో పొట్టి క్రికెట్‌ను శాసిస్తున్నారు ఐపీఎల్ జట్ల యజమానులు. ఈమధ్యే ఆర్థికంగా సతమతం అవుతున్న ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్ (England Club Cricket)కు ఊపిరిలూదేందుకు వీరంతా సిద్ధమయ్యారు. ‘ది హండ్రెడ్ లీగ్’ (The Hundred League)లో జట్లలో వాటాను కొనుగోలు చేసి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఐపీఎల్ జట్లు తమతో చేయి కలిపిన వేళ రూ.60 వేల కోట్ల ఆదాయంపై కన్నేశారు హండ్రెడ్ లీగ్ నిర్వాహకులు.