Supreme Court | పార్టీ ఎమ్మెల్యేల అనర్హతవేటు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది. స్పీకర్‌కు కోర్టులు సూచనలు చేసే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనున్నది. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా కోర్టులు జోక్యం చేరసుకోవచ్చా? అనే అంశంపై ఇప్పటికే వాదనలు విన్నది. అంశంపై ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. దాంతో తీర్పును ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ కేసులో గురువారం ఉదయం సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరించనున్నది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై సుప్రీంకోర్టు పలుసార్లు విచారణ జరిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై తాజాగా తీర్పును వెలువరించనున్నది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల భవితవ్యం గురువారం తేలనున్నది. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.