Vishwambhara | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో నటిస్తోన్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ విశ్వంభర (Vishwambhara). ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశ్వంభరలో చిరంజీవి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్‌పై వచ్చే స్పెషల్ సాంగ్‌ను షూట్ చేశారు. గణేశ్ మాస్టర్ నేతృత్వంలో పాట చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ బీటీఎస్ స్టిల్స్‌ను నెట్టింట షేర్ చేసింది మౌనీ రాయ్. గత కొన్ని రోజులుగా మీ పక్కన డ్యాన్స్ చేయడం ఎంతో గౌరవంగా ఉంది చిరంజీవి సార్.. మీరు ఒక లెజెండరీ యాక్టర్ మాత్రమే కాదు. అద్భుతమైన వ్యక్తి కూడా. నేను మీతో పనిచేస్తున్నంత సేపు అపారమైన ఆప్యాయత, గౌరవాన్ని పొందాను. మీతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. మీ దయా హృదయానికి.. మీరందించిన అత్యుత్తమ బిర్యానీకి ధన్యవాదాలు. లవ్ యూ.. అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది మౌనీ రాయ్.
అదేవిధంగా గణేశ్ మాస్టర్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు. సమన్వయంతో తనకు మద్దతుగా నిలిచిన టీం మెంబర్స్ అందరినీ ప్రశంసలు కురిపించింది. సాంగ్ షూటింగ్ పూర్తవడంతో మల్లిడి వశిష్ఠ టీం ఎప్పుడు విడుదల చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
MEGASTAR #Chiranjeevi and#MouniRoy during a song shoot for #Vishwambhara ❤❤
#MegastarChiranjeevi pic.twitter.com/i8NvKxZZ51— Sai Satish (@PROSaiSatish) July 30, 2025
Pawan Kalyan | ఓజీ కోసం వన్స్‌మోర్ అంటోన్న పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా..?
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’