Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన సినిమాలు ఒక్కోటిగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఉస్తాద్భగత్ సింగ్, ఓజీ సినిమాలను కూడా పూర్తి చేయడంపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే కెరీర్లో తొలిసారి పవన్ కల్యాణ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడని తెలిసిందే.
నిర్మాత ఏఎం రత్నం విజ్ఞప్తి మేరకు పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు కోసం ప్రమోషనల్ ఈవెంట్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాడు. కాగా సుజిత్ డైరెక్షన్లో నటస్తున్న ఓజీ కోసం కూడా ఇదే రూట్‌ను ఎంచుకోబోతున్నాడట. ఓజీపై బజ్‌ను మరింత పెంచేలా ఇంటర్వ్యూల్లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. మరి ఇదే నిజమైతే సినిమా గురించి ఎలాంటి విషయాలు ప్రేక్షకులు, అభిమానులతో షేర్ చేసుకుంటాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’