Ollie Pope | స్కూప్ షాట్ మొనగాడు పోప్.. అండర్-19 మ్యాచ్ వీడియో వైరల్
Ollie Pope : భారత గడ్డపై ఉప్పల్ స్టేడియంలో వీరోచిత శతకం బాదిన ఇంగ్లండ్ క్రికెటర్ ఓలీ పోప్(Ollie Pope)పై దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అశ్విన్, జడేజాలాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అలవోకగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడిన పోప్...
Ollie Pope : భారత గడ్డపై ఉప్పల్ స్టేడియంలో వీరోచిత శతకం బాదిన ఇంగ్లండ్ క్రికెటర్ ఓలీ పోప్(Ollie Pope)పై దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అశ్విన్, జడేజాలాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అలవోకగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడిన పోప్.. 4 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అతడు స్కూప్ షాట్‌తో అలరించాడు.
జడ్డూ బౌలింగ్‌లో ఎడమ మోకాలిపై కూర్చొని స్కూప్ షాట్(Scoop Shot) ద్వారా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ మీదుగా బంతిని బౌడరీకి తరలించాడు. దాంతో, 8 ఏండ్ల క్రితం అతడు ఆడిన ఆ షాట్‌ను అభిమానులు గుర్తుచేసుకున్నారు. 2016లో తొలిసారి పోప్ ఆ స్కూప్ షాట్ ఆడాడు.
Ollie Pope has just done this. I approve. pic.twitter.com/54huPWF9az
— Elizabeth Ammon (@legsidelizzy) August 16, 2016
అండర్ -19 మ్యాచ్‌లో భాగంగా 2016లో శ్రీలంకపై పోప్ స్కూప్ షాట్ ఆడాడు. విధ్వంసక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ కనిపెట్టిన ఆ షాట్‌ను లంకపైనే ఆడి చూపించి అందర్నీ ఫిదా చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దమిత సిల్వా (Damitha Silva)రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయగా.. పోప్ ఎడమ మోకాలిపై కూర్చొని బంతిని కీపర్ తల మీదుగా కొట్టాడు. అయితే.. అప్పుడు కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 300 ఛేదనలో పోప్ 78 బంతుల్లోనే 87 రన్స్ కొట్టాడు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లకు 276 పరుగులే చేసి ఓటమి పాలైంది.
Some player https://t.co/oRZuOLMasG pic.twitter.com/YuzW7ZvUnQ
— aki 🎲 (@padiopanee) January 27, 2024
తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుతో నిరాశపరిచిన పోప్.. రెండో ఇన్నింగ్స్‌లో వీరవిహారం చేశాడు. భారత బౌలర్లను ఉతికారేస్తూ 278 బంతుల్లో 21 ఫోర్లతో 196 పరుగులు బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే.. మరో నాలుగు రన్స్ కొడితే డబుల్ సెంచరీ పూర్తవుతుందనగా.. బుమ్రా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. అతడి సంచలన ఇన్నింగ్స్‌కు అరంగేట్రం స్పిన్నర్ టామ్ హర్ట్లే మ్యాజిక్ తోడవ్వడంతో ఇంగ్లండ్ అద్భత విజయం నమోదు చేసింది. దాంతో ఐదు టెస్టుల సిరీస్‌లో బెన్ స్టోక్స్ సేన 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2న విశాఖపట్టణంలో రెండో టెస్టు జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Snowfall | కొత్త అందాలను సంతరించుకున్న కశ్మీర్ వ్యాలీ.. VIDEO
- MK Stalin | టెన్నిస్ లెజెండ్‌తో తమిళనాడు సీఎం.. ఎక్కడ కలిశారంటే..?
- Israel-Hamas War | గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. గత 48 గంటల్లో 350 మంది మృతి: హమాస్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

