Suicide | పెంపుడు కుక్క మరణించిందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న బాలిక..!
Suicide | చాలామంది పిల్లలు పెంపుడు జంతువులతో ఎంతో అనుబంధం ఏర్పర్చుకుంటారు. వాటితో ఆడుతూ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అంతవరకు పరవాలేదు. కానీ కొందరు పిల్లలు పెంపుడు జంతువులపై మరీ ప్రేమ పెంచుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అనుకోనిది ఏదైనా జరిగి ఆ పెంపుడు జంతువు దూరమైతే పిల్లలు తట్టుకోలేరు.
Suicide : చాలామంది పిల్లలు పెంపుడు జంతువులతో ఎంతో అనుబంధం ఏర్పర్చుకుంటారు. వాటితో ఆడుతూ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అంతవరకు పరవాలేదు. కానీ కొందరు పిల్లలు పెంపుడు జంతువులపై మరీ ప్రేమ పెంచుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అనుకోనిది ఏదైనా జరిగి ఆ పెంపుడు జంతువు దూరమైతే పిల్లలు తట్టుకోలేరు.
నిద్రాహారాలు కూడా మానేసి ఏడుస్తూ కూర్చుంటారు. వారిని తిరిగి మమూలు మనుషులను చేయడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. తాజాగా హర్యానాకు చెందిన పెంపుడు కుక్క మరణించిన బాధ భరించలేక మరింత తీవ్ర నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదు రోజులుగా నిద్రహారాలు మానేసి ఏడుస్తూ కూర్చున్న బాలిక చివరికి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది.
తల్లి, సోదరి కిరాణా సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వచ్చే లోపే దారుణానికి పాల్పడింది. మూడు నెలల క్రితం తాము ఒక కుక్కపిల్లను తెచ్చుకున్నామని, దాంతో తమ కూతురుకు మంచి అనుబంధం ఏర్పడిందని, రోజు దానితో ఆడుతుండేదని మృతురాలి తల్లి చెప్పింది. ఐదు రోజుల క్రితం ఆ కుక్కపిల్ల చనిపోవడంతో పాప తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందని, ఎప్పుడూ ఏడుస్తూ ముభావంగా కూర్చున్నదని, భోజనం కూడా సరిగా తినలేదని, కానీ ఇంటపని చేస్తుందని తాము ఊహించలేదని ఆమె విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Girl Suicide
- haryana
- pet dog
- Puppy
RELATED ARTICLES
తాజా వార్తలు
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
Horoscope | 11-11-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
అన్ని బస్స్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు: ఆర్టీసీ ఎండీ
జనవరిలో అల్వాల్ టిమ్స్ ప్రారంభం: దామోదర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

