GT vs RCB : సొంత మైదానంలో రెచ్చిపోయి ఆడుతున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యువకెరటం షారుఖ్ ఖాన్(54) హాఫ్ సెంచరీ బాదాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, సిక్సర్ బాది ఫిఫ్టీ సాధించాడు. మరో ఎండ్‌లో సాయి సుదర్శన్(43) బౌండరీలతో చెలరేగుతున్నాడు.
ఒక దశలో 45కే రెండు వికెట్లు పడిన గుజరాత్ టైటాన్స్‌ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేస్తూ.. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడుతూ గుజరాత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 125/2