GT vs RCB : ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్లో ఆహ్మదాబాద్ వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు(Royal Challenger Bangalore), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాంటింగ్ దిగిన జీటీ పరుగుల కోసం తంటాలు పడుతున్నది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో గుజరాత్ స్కోర్ బోర్డు వేగం నెమ్మదించింది.
పవర్‌ప్లే ముగిసే సరికి ఆ జట్టు 42 పరుగులే చేసింది. కాగా, పవర్‌ప్లే అయిన వెంటనే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో గిల్(16) పరుగుల వద్ద వెనుదిరిగాడు. బౌండరీ లైన్ వద్ద గ్రీన్ అద్భుతమైన క్యాచ్‌తో గిల్‌ను వెనక్కి పంపాడు. సాయి సుదర్శన్(30నాటౌట్), షారుక్‌ఖాన్(3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం జీటీ స్కోర్.. 64-2.