Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ఆ రేంజ్‌కు తగ్గట్లే ఉంటుంది. ఎక్కడా ఆమె వైభవం తగ్గదు. రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ ఆమె. ఈవెంట్లకు తగ్గట్టు కట్టూబొట్టుతో ఆకట్టుకుంటుంటుంది. పూజా, వివాహాది కార్యక్రమాలకు సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చే నీతా.. బిజినెస్ ఈవెంట్లలో అందుకు తగ్గట్టు దుస్తులను ధరిస్తుంటారు. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు తీసిపోని రీతిలో ఫ్యాషన్‌ను ప్రదర్శిస్తుంటారు.
తాజాగా దుబాయ్‌లోని జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం 2025లో (IPL auction) మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించారు. నీతా అంబానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని అన్న విషయం తెలిసిందే. వేలం తొలిరోజు కార్యక్రమంలో నీతా అంబానీ ఖరీదైన సూట్లో ఎంతో హుందాగా దర్శనమిచ్చారు. మెటాలిక్ థ్రెడింగ్‌తో రూపొందించిన నేవీ బ్లూ సూట్‌ను ధరించి ఆకర్షణీయంగా కనిపించారు. వీటితోపాటు సన్ గ్లాసెస్, ఆకర్షణీయమైన డైమండ్ చెవిపోగులు, ప్రత్యేక ఉంగరాన్ని ధరించి వచ్చారు. ఆమె ధరించిన వాచ్, హీల్స్ కూడా ప్రత్యేకంగా అనిపించాయి. ఆమె చేతిలో విలాసవంతమైన ఒక హ్యాండ్‌బ్యాగ్ కూడా కనిపించింది. అయితే, ఐపీఎల్ వేలం ఈవెంట్లో నీతా ధరించిన ప్యాంట్‌సూట్ (pantsuit) ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ ప్యాంట్‌సూట్ ధర 950 డాలర్లు అని తెలిసింది. అంటే మన భారత కరెన్సీలో రూ.78వేలు అన్నమాట. ఇందులో బ్లేజర్ ధరే ఏకంగా 565 డాలర్లుగా ఉంది. అంటే రూ.47 వేలు అన్నమాట. ఇక ప్యాంట్ ధర 385 డాలర్లు.. అంటూ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.31 వేలు. ఈ డ్రెస్ ప్రైజ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
IND vs AUS BGT | ఆసీస్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 లీడ్
IND Vs AUS | మిచెల్ మార్ష్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్
IND Vs AUS | స్టీవ్ స్మిత్ ఔట్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ