IND vs AUS BGT : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్లు ఘన విజయం సాధించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దాంతో ప్రతిష్ఠాత్మక సిరీస్లో ఇండియా టీమ్ 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ కేవలం 150 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దాంతో గెలుపు అసాధ్యమే అనుకున్నారంతా. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా కూడా 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్.. యశస్వి జైస్వాల్ (161 పరుగులు), విరాట్ కోహ్లీ (100 పరుగులు), కేఎల్ రాహుల్ (77 పరుగులు) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో 487 పరుగుల భారీ స్కోర్ సాధించి మరో మూడు వికెట్లు ఉండగానే డిక్లేర్ చేసింది.
అనంతరం 534 పరుగుల భారీ లక్ష్య చేధన కోసం బరిలో దిగిన ఆస్ట్రేలియా కేవలం 238 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 295 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది. మరో రోజు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. భారత్ 1-0 లీడ్ దక్కింది.