పెర్త్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ (IND Vs AUS) విజయం దిశగా పయణిస్తున్నది. ఆతిథ్య జట్టు ముందుకు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ఇండియా.. ఆసీస్ బ్యాట్సమెన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా భారీ షాట్‌కు యత్నించాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి పైకి లేచింది. దీంతో రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో 17 పరుగుల వద్ద ఆస్ట్రేలియా జట్టు నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్ హెడ్.. స్టీవ్ స్మిత్‌తో కలిసి కాసేపు భారత బౌలర్లను చికాకు పెట్టాడు. హార్డ్ హిట్టింగ్తో ఎదురుదాడికి దిగాడు. అయితే మరోసారి సిరాజ్ తన అద్భుత బౌలింగ్‌తో ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. జట్టు 79 పరుగుల వద్ద స్మీట్ స్మిత్‌ను ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన ఆడబోయిన స్మిత్.. వికెట్ కీపర్ పంత్‌కు చిక్కాడు. దీంతో కంగారు జట్టు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. అయితే ట్రావిస్ హెడ్ మాత్రం బ్యాట్‌తో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. 64 బాల్స్‌లోనే 53 రన్స్ చేశాడు. ప్రస్తుతం హెడ్‌తోపాటు మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నాడు.
How good was that delivery by @mdsirajofficial to get the wicket of Steve Smith 🔥
Live – https://t.co/dETXe6cqs9… #AUSvIND pic.twitter.com/aD3e9w3JKk
— BCCI (@BCCI) November 25, 2024