పెర్త్: పెర్త్ టెస్టులో విజయానికి టీమ్ఇండియా (IND Vs AUS) మరింత చేరువయింది. కొరకరాని కొయ్యలుగా మారిన ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మర్ష్లను బుమ్రా, నితీశ్ కుమార్ ఔట్ చేశారు. దీంతో210 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ క్రీజులో ఉన్నారు. 12/3తో నాలుగోరోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. రెండో ఓవర్లోనే ఖవాజా రూపంలో నాలుగో వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హెట్.. సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి భారత బౌలర్లను సమర్ధంగా అడ్డుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 24.4 ఓవర్ వద్ద స్మిత్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. 17 రన్స్ చేసిన స్మిత్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరోవైపు ట్రావిస్ హెడ్.. టీమ్ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి మిచెల్ మార్ష్ హార్డ్ హిట్టింగ్ తోడవడంతో స్కోర్‌బోర్డును పరుగెత్తింది.
ఈ క్రమంలో కెప్టెన్ బుమ్రా రంగంలోకి దిగాడు. ఇన్నింగ్స్ 38.5 ఓవర్లో మార్ష్, హెడ్ జోడీని విడగొట్టాడు. 89 రన్స్‌తో జోష్‌మీద ఉన్న హెడ్‌ను ఔటు చేశాడు. అనంతరం తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. మార్ష్‌ను బుట్టలో పడేశాడు. 182 రన్స్ వద్ద మిచెల్ మార్ష్‌ను (67 బాల్స్‌లో 47 పరుగులు) వికెట్ల ముందు దొరకబట్టాడు. దీంతో నితీశ్‌కు తొలి వికెట్ దక్కినట్లయింది. ప్రస్తుతం అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ క్రీజ్‌లో ఉన్నారు. ఏడు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 210 పరుగులు చేసింది. విజయం కోసం మరో 325 రన్స్ చేయాల్సి ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.
Nitish Kumar Reddy gets the breakthrough!
Picks up the wicket of Mitchell Marsh who is bowled for 47 runs.
This is his maiden wicket in Test cricket 🔥
Live – https://t.co/gTqS3UPruo… #AUSvIND pic.twitter.com/Q5YbOLZoYu
— BCCI (@BCCI) November 25, 2024