Neeraj Chopra : ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) దేశంనిండా సంబురాలు నింపాడు. తృటిలో స్వర్ణం చేజార్చకున్న నీరజ్.. కోట్లాది మంచి నమ్మకాన్ని నిలబెడుతూ పోడియం మీద మువ్వన్నెల జెండాను ఎగురవేశాడు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నాడు. కొంతకాలంగా గజ్జల్లో గాయం(Groin Injury)తో బాధ పడుతున్న అతడు జర్మనీలో సర్జరీ చేయించుకోనున్నాడు.
ఒలింపిక్స్ కోసమే సర్జరీ వాయిదా వేసుకున్న నీరజ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. పారిస్‌లో వెండి పతకంతో మెరిసిన నీరజ్ అక్కడి నుంచి నేరుగా జర్మనీకి వెళ్లాడు. తరచూ తిరగబెడుతున్న గాయంపై బల్లెం యోధుడు అక్కడి వైద్యుల సలహా తీసుకోనున్నాడు. అవసరమైతే చిన్నపాటి సర్జరీ కూడా చేయించుకుంటాడని చోప్రా అంకుల్ భీమ్ చోప్రా తెలిపాడు. సర్జరీ జరిగితే మరో నెల రోజుల పాటు నీరజ్ చోప్రా జర్మనీలో ఉండాల్సి వస్తుందని ఆయన చెప్పాడు.
రెండేండ్ల క్రితం జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ (World Championships 2022) పోటీల్లో మొదటిసారి నీరజ్‌కు గజ్జల్లో గాయమైంది. అప్పటి నుంచి అతడు ఆ సమస్యంతో బాధ పడుతూనే ఉన్నాడు. దాంతో, సర్జరీతో పరిష్కారం ఉంటుందని పలువురు వైద్యులు అతడికి సూచించారు.
విశ్వ క్రీడల క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ అంచనాలను అందుకున్నాడు. 89.34 మీటర్లతో అందరిని వెనక్కి నెట్టి ఫైనల్‌కు దూసుకెల్లాడు. పసిడి పోరులో అతడు శక్తినంత కూడదీసుకొని ఈటెను 89. 45మీటర్ల దూరం విసిరాడు. అర్షద్ నదీమ్(పాక్) 92.97 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా.. రెండో స్థానం దక్కించుకొని వరుసగా రెండో పతకంతో దేశం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ओलंपिक खेलों में भारत के लिए एक और पदक जीतके बहुत अच्छा लगा। इस बार पेरिस में हमारा National Anthem नहीं बज पाया, लेकिन आगे की मेहनत उसी पल के लिए होगी।💪
Very proud to be on the podium for India once again at the Olympic Games. Thank you for the love and support. Jai Hind! 🇮🇳… pic.twitter.com/b2DoatANPn
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 10, 2024
తద్వారా సుశీల్ కుమార్ (రెజ్లింగ్), పీవీ సింధు(బ్యాడ్మింటన్)ల తర్వాత వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా నీరజ్ రికార్డు నెలకొల్పాడు. ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో వరుసగా రెండో మెడల్‌తో యావత్ భారతాన్ని సంతోషంలో ముంచెత్తిన నీరజ్ శనివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన విజయానందాన్ని అందరితో పంచుకున్నాడు.