హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన రెండో విడత భూసేకరణపై రైతులు మండిపడ్డారు. బాబు సర్కార్‌పై రైతులంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. తొలి దశలో వేలాది ఎకరా లు ఇచ్చి సంచార జాతులుగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నామని తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశారు. బుధవారం తుళ్లూరు మండలం వడ్డమానులో రెండో దశ ల్యాండ్ ఫూలింగ్ కోసం నిర్వహించిన గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ను రైతులు నిలదీయడంతో గందరగోళం నెలకొన్నది.
మూడేండ్లలో అభివృద్ధి గ్యారంటీ అని రాసిస్తారా? అంటూ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేను నిలదీశారు. ఇందుకు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ.. మూడేండ్లలో అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లొచ్చని ఉచిత సలహా ఇచ్చా రు. 2014లో టీడీపీ సర్కార్ మాట నమ్మి 50వేల మంది రైతులు భూము లు ఇచ్చారని, ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చారా అని ప్రశ్నించారు. భూములి చ్చిన రైతుల బతుకు అరణ్య రోదన అయిందని ఆవేదన వ్యక్తంచేశారు.