Natasa Stankovic | భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ (Natasa Stankovic) దాదాపు రెండు నెలల తర్వాత ముంబై (Mumbai)లో దర్శనమిచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ (Aleksandar Ilac)తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది. వైట్ జాకెట్ వేసుకున్న నటాషా.. ఓ జిమ్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హార్దిక్ – నటాషా ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అన్యోన్యంగా నాలుగేండ్లకు పైగా సాగిన తమ ప్రేమ ప్రయాణానికి ఈ జంట అర్ధంతరంగా ముగింపు పలికింది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. డివోర్స్ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ప్రకటన వెంటనే కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా తన సొంత దేశం సెర్బియా వెళ్లిపోయింది. అక్కడే తన కుమారుడి బర్త్‌డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దాదాపు రెండు నెలలపాటు సెర్బియాలోనే గడిపిన ఈ మోడల్.. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చింది. ముంబైలో తన బాయ్‌ఫ్రెండ్‌ను వెంటేసుకుని చక్కర్లు కొడుతోంది.
రెండు సార్లు పెళ్లి..
మోడల్ అయిన నటాషాతో పాండ్యాకు 2020 మార్చి 31న వివాహమైంది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. అయితే, తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంలా మలచుకోవాలని భావించిన ఈ ప్రేమ జంట.. పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఫ్రిబవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున ఉదయ్‌పూర్‌లో కన్నుల పండువగా రెండోసారి వివాహం చేసుకున్నారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకుని.. ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు.
Also Read..
Python | షాకింగ్ ఘటన.. ఆవుదూడను సజీవంగా మింగేసిన కొండచిలువ
RG Kar Case | వైద్యులను చర్చలకు పిలిచిన బెంగాల్ సర్కారు.. లైవ్ టెలికాస్ట్ ప్రతిపాదన తిరస్కరణ
YS Sharmila | గత ప్రభుత్వాల వైఫల్యంతోనే విజయవాడకు వరదలు : వైఎస్ షర్మిల