Python | ఉత్తరప్రదేశ్ ఆగ్రా (Agra)లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భారీ కొండచిలువ (Python) ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది (Python Swallows Calf Alive). చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు. 16 అడుగుల ఈ పైతాన్ (16 Foot Python) ఆవు దూడ సగ భాగాన్ని మింగేసి.. మిగతా సగభాగాన్ని చుట్టేసుకుని కనిపించింది. స్థానికులు వెంటనే దూడను కాపాడే ప్రయత్నం చేశారు. కర్నల సాయంతో కొండచిలువ శరీరం నుంచి దూడను బయటకు నెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. పైతాన్ పొట్ట నుంచి ఆవును బయటకు తీసినప్పటికీ.. అది ఊరిరాడక అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.
Also Read..
Singer Mano | సింగర్ మనో కుమారులపై కేసు
Samosa | సమోసాలో కప్ప కాలు దర్శనం.. షాకైన కస్టమర్..! వైరల్ వీడియో
Bomb Threat | చెన్నై ఎంఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్