Singer Mano | ప్రముఖ సింగర్ మనో (Singer Mano) కుమారులపై కేసు నమోదైంది. కళాశాల విద్యార్థులపై దాడి నేపథ్యంలో మనో కుమారులు రఫీ, షకీర్ సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. చెన్నై ఆలప్పాక్కంకి (Alapakkam) చెందిన 20 ఏళ్ల కృపాకరన్ , మదురవాయల్కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్థి వళసరవాక్కం (Valasaravakkam) శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. వారు మంగళవారం రాత్రి అకాడమీ నుంచి ఇంటికి వెళ్తూ.. స్థానికంగా ఉన్న హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్లు తమ స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నారు.
మద్యం మత్తులో ఉన్న వారు.. కృపాకరన్తోపాటు 16 ఏళ్ల బాలుడితో ఘర్షణకు దిగారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి.. గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరిపై ఐదుగురు దాడి చేశారు. ఈ దాడిలో కృపాకరన్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వళసరవాక్కం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రఫి, షకీర్.. వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్పై కేసు నమోదు చేశారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద కేసులు బెక్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..
Samosa | సమోసాలో కప్ప కాలు దర్శనం.. షాకైన కస్టమర్..! వైరల్ వీడియో
Fuel Prices | పేట్రేగిన పెట్రో ధరల నుంచి ఉపశమనం : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు కసరత్తు