Samosa | సాధారణంగా బయట దొరికే ఆహార పదార్థాలను తీసుకోవద్దంటారు. ఎందుకంటే బయటి ఆహారాల తయారీకి నాసిరకం నూనెలు, పదార్థాలు వాడుతారని.. వాటి కారణంగా ఆనారోగ్యాలు దాపురిస్తాయని చెబుతుంటారు. బయటి ఆహారాల్లో కల్తీ మాత్రమే కాదు, శుభ్రత కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో పిన్నులు, సూదులు, క్రిములు, కీటకాలు బయటపడుతున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
మొన్నటికి మొన్న ముంబైకి చెందిన వైద్యుడు కోన్ ఐస్‌క్రీమ్ బుక్ చేస్తే అందులో మనిషికి సంబంధించిన తెగిపోయిన వేలు దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నోయిడా సిటీలోని సెక్టార్-12 కు చెందిన ఓ మహిళ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ బ్లింకిట్ ద్వారా అమూల్ ఐస్‌క్రీమ్ బుక్ చేయగా అందులో జెర్రి దర్శనమిచ్చింది. దాంతో షాకవడం ఆమె వంతైంది. ఇప్పుడు తాజాగా అలాంటి అనుభవమే మరో కస్టమర్‌కు ఎదురైంది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న బికనీర్ స్వీట్స్ షాప్‌లో (Bikaner Sweets Outlet) సమోసా (Samosa) కొనుక్కున్నాడు. ఎంతో ఆత్రుతగా దాన్ని తినడం మొదలు పెట్టాడు. ఇంతలో అతడికి ఊహించని షాక్ తగిలింది. సమోసా మధ్యలో కప్ప కాలు (Frog Leg) దర్శనమిచ్చింది. దాంతో కంగుతినడం అతని వంతైంది. వెంటనే దుకాణంలో ఉన్న వారిని ఈ ఘటనపై ప్రశ్నించాడు. వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడే ఉన్న వారు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
In Ghaziabad, UP, a frog’s leg was found inside a samosa. The case is of Bikaner Sweets. Police took the shopkeeper into custody. The food department sent samples for testing.
ससुरे पूरा मेंढक भी नहीं डाल सकते ?
हद है कंजूसी की 🤦🏻♂️ pic.twitter.com/TmbzndZyUa— amrish morajkar (@mogambokhushua) September 12, 2024
Also Read..
Bomb Threat | చెన్నై ఎంఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..
Arvind Kejriwal | ఊరట దక్కేనా..? కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు