Bomb Threat | దేశంలో గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, విమానాశ్రయాలు, వ్యక్తులకు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చెన్నై (Chennai) ఎంఐటీ క్యాంపస్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రోంపేట (Chrompet)లోని అన్నా యూనివర్సిటీ (Anna University) ఎంఐటీ క్యాంపస్‌కు (MIT Campus) గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయ ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎంఐటీ క్యాంపస్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Arvind Kejriwal | ఊరట దక్కేనా..? కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..
PM Modi | సీజేఐ ఇంట గణపతి పూజ.. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న ప్రధాని మోదీ