Ranji Trophy 2024 | విదర్భ పోరాడినా ముంబైదే టైటిల్.. ఎనిమిదేండ్ల కల సాకారం
Ranji Trophy 2024 : రంజీల్లో తిరుగులేని ముంబై(Mumbai) మరోసారి చాంపియన్గా అవతరించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో విదర్భ(Vidarbha)ను మట్టికరిపించి 8 ఏండ్ల తర్వాత టైటిల్ను ముద్దాడింది. 169 పరుగుల తేడాతో విదర్భను చిత్తు చేసింది. అక్షయ్ వద్కార్(102) సెంచరీతో పోరాడినా...
Ranji Trophy 2024 : రంజీల్లో తిరుగులేని ముంబై(Mumbai) మరోసారి చాంపియన్గా అవతరించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో విదర్భ(Vidarbha)ను మట్టికరిపించి 8 ఏండ్ల తర్వాత టైటిల్ను ముద్దాడింది. 169 పరుగుల తేడాతో విదర్భను చిత్తు చేసింది. అక్షయ్ వద్కార్(102) సెంచరీతో పోరాడినా.. తనుష్ కొటియాన్ దెబ్బతో విదర్భను కుప్పకూల్చాడు. దాంతో, ముంబై ఖాతాలో 42వ రంజీ టైటిల్ వచ్చి చేరింది.
సొంత ప్రేక్షకుల సమక్షంలో ముంబై సారథి అజింక్యా రహానే టైటిల్ అందుకున్నాడు. సెంచరీ హీరో ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా.. తనుష్ కొటియాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుపొందాడు. ఐదు రోజుల పాటు ఉత్కంఠ రేపిన రంజీ ఫైనల్లో ముంబై రఫ్పాడించింది.
Emotions ☺️
Classy Gestures 🫡
A Special Triumph 🙌
This moment has it all 👏 👏
Scorecard ▶️ https://t.co/L6A9dXXPa2#RanjiTrophy | #Final | #MUMvVID | @IDFCFIRSTBank | @MumbaiCricAssoc pic.twitter.com/rV2ziXZnOV
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024
తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ పృథ్వీ షా(44), శార్థూల్ ఠాకూర్(75) హాఫ్ సెంచరీతో 224 రన్స్ కొట్టిన ముంబైని బౌలర్లు ఆదుకున్నారు. విదర్భను 105 పరుగులకే ఆలౌట్ చేసి ఆధిక్యం అందించారు. ఆ తర్వాత ముషీర్ ఖాన్(136), శ్రేయస్ అయ్యర్(95), రహానే(73)లు అద్భుత పోరాటంతో విదర్భకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అక్షయ్ సెంచరీ వృథా
అనంతరం విదర్భ బ్యాటర్లు కూడా మేమేమీ తక్కువ కాదన్నట్టు దంచికొట్టారు. ఓపెనర్లు అథర్వ తైడే(32), ధ్రువ్ శొరే(28)లు శుభారంభం ఇచ్చారు. నాలుగో రోజు అసమాన పోరాటంతో 5 వికెట్ల నష్టానికి రన్స్ చేసింది. ముంబైకి చెమటలు పట్టించిన బరోడా బ్యాటర్లు.. ఐదో రోజు నిలబడలేకపోయారు.
Century for Akshay Wadkar 💯 🙌
What a fabulous knock from the captain. He’s kept Vidarbha on course for the chase 👏#RanjiTrophy | @IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/pj0fqgL89M
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024
అక్షయ్ వద్కర్(102) సెంచరీతో, హర్ష్ దుబే(65) చెలరేగినా.. తర్వాత వచ్చిన వాళ్లు విఫలమయ్యారు. తనుష్ కొతియన్ దెబ్బకు విదర్భ 368 పరుగులకే కుప్పకూలింది. దాంతో, 169 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై 8 ఏండ్ల తర్వాత చాంపియన్గా అవతరించింది.
ఇవి కూడా చదవండి
- Lahiru Thirimanne | గుడికి వెళ్తుడంగా యాక్సిడెంట్.. శ్రీలంక మాజీ క్రికెటర్కు గాయాలు
- Chaari 111 Movie | ఓటీటీలోకి రాబోతున్న వెన్నెల కిషోర్ ‘చారి 111’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- Spotify | మ్యూజిక్ వీడియో ఫీచర్ను ప్రవేశపెట్టిన స్పాటిఫై
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

