Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటించింది. టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ వేదికలు ఆహాతో పాటు ‘అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా మార్చి 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టెర్రరిజంకు చెందిన ఒక సీక్రెట్ గ్రూప్ ఇండియాలో కోవర్ట్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. ఇక ఇది కనిపేట్టే సీక్రెట్ స్పై ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మించింది.