Lahiru Thirimanne : శ్రీలంక మాజీ క్రికెటర్ లహిరు తిరుమన్నే(Lahiru Thirimanne) కారు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో అతడు స్వల్ప గాయలతో బయటపట్డాడు. అసలేం జరిగిందంటే..? కుటుంబంతో కలిసిగుడికి వెళ్తుండగా తిరుమన్నే కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.
థిరపన్నే సమీపంలో ఒక లారీ అతడి కారును బలంగా ఢీకొట్టింది. దాంతో, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నంది. అయితే.. ఈ సంఘటనలో తిరుమన్నేకు పెద్ద గాయాలు కాకపోవడంతో లంక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమన్నే త్వరగా కోలుకోవాలని లంక క్రికెట్ బోర్డు పోస్ట్ పెట్టింది.
తిరుమన్నే నిరుడు జూలైలో అంతర్జాతీయ క్రికెట్లో వీడ్కోలు పలికాడు. అతడు 44 టెస్టులు 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం అతడు ‘లెజెండరీ క్రికెట్ ట్రోఫీ’లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.