OTT platforms | న్యూడ్ కంటెంట్.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం
OTT platforms | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ (pornographic content)ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది.
OTT platforms | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ (pornographic content)ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. దేశంలో పబ్లిక్ యాక్సెస్ ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్‌ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. అయితే, కేంద్రం హెచ్చరికలను ఆయా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోలేదు. దీంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయా సంస్థలపై వేటు వేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్ ఉన్నాయి.
కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డ్రీమ్స్ ఫిల్మ్స్, అన్‌కట్ అడ్డా, వూవీ, యేస్మా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియోన్ ఎక్స్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్ట్రా మూడ్, మూడ్ఎక్స్, మోజ్ఫ్లిక్స్, హాట్ షార్ట్స్ వీఐపీ, ఫ్యూజీ, ప్రైమ్ ప్లే తదితర ఓటీటీలు ఉన్నాయి. ఈ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో న్యూడ్ కంటెంట్ ఎక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. Technology Act, 2000లోని నిబంధనల ప్రకారం ఇది నేరంగా పరిగణించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Also Read..
Jamili Elections | జమిలిపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్ కమిటీ
Lok Sabha Polls | రెండు జాబితాలు.. 21 శాతం సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ నో టిక్కెట్..
Amit Shah | సీఏఏను ఎన్నటికీ వెనక్కి తీసుకోబోం.. అమిత్ షా స్పష్టీకరణ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

