Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది. ఈ మేరకు తుది నివేదికను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu)కు అందజేసింది.
దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఒకే దేశం-ఒకే ఎన్నిక (one nation – one election) నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ మనదేశంలో ఎంతవరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరించింది. ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిసి తుది నివేదికను సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను రాష్ట్రపతికి అందించింది.
The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng
— ANI (@ANI) March 14, 2024
Also Read..
Lok Sabha Polls | రెండు జాబితాలు.. 21 శాతం సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ నో టిక్కెట్..
Amit Shah | సీఏఏను ఎన్నటికీ వెనక్కి తీసుకోబోం.. అమిత్ షా స్పష్టీకరణ
Tik Tok | అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్.. నిషేధ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం