Tik Tok | అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్.. నిషేధ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
Tik Tok | చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ (Tik Tok) నిషేధానికి సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది (US House Passes Bill).
Tik Tok | చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ (Tik Tok) నిషేధానికి సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది (US House Passes Bill). ఈ నిషేధ బిల్లుకు 352 మంది అనుకూలంగా ఓటు వేయగా.. 65 మంది వ్యతిరేకించారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ సభ్యులతోపాటు విపక్ష రిపబ్లికన్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సెనేట్‌లో ఆమోదం తర్వాత ఈ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంతకం చేయాల్సి ఉంటుంది. బైడెన్ సంతకం తర్వాత ఈ బిల్లు చట్టం కానుంది.
కాగా, ‘విదేశీ నియంత్రిత యాప్‌ల నుంచి అమెరికన్లకు రక్షణ’ పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్ గల్లాఘే కలిసి రూపొందించారు. ఈ బిల్లు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించింది కాదని డెమోక్రాటిక్ సభ్యుడు కృష్ణమూర్తి తెలిపారు. దాన్ని నియంత్రిస్తున్న బైట్‌డ్యాన్స్ (ByteDance) గురించి అని చెప్పారు.
టిక్‌టాక్ యాజమాన్యం పూర్తిగా దాని ఆధీనంలోనే ఉందన్న ఆయన.. ఆ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధీనంలో పనిచేస్తోందని వెల్లడించారు. బైట్ డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సీసీపీలో అత్యున్నత హోదాలో ఉన్నారంటే పరోక్షంగా టిక్‌టాక్‌ను సీసీపీ నియంత్రిస్తోందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు సీపీపీ నియంత్రణలోని టిక్‌టాక్ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మైక్ పెన్స్ అన్నారు.
Also Read..
Elon Musk | 2029నాటికి మానవ మేధస్సును మించనున్న ఏఐ: ఎలాన్ మస్క్
Polio Paul | పోలియో పాల్ ఇక లేరు.. 72 ఏండ్లపాటు ఇనుప యంత్రంలోనే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

