Hyderabad | స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి.. హైదరాబాద్‌లో విషాదం
Hyderabad | హైదరాబాద్‌లోని నిజాంపేటలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ దుర్మరణం చెందాడు.
Hyderabad | హైదరాబాద్‌లోని నిజాంపేటలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ దుర్మరణం చెందాడు.
బాలుడి తల్లిదండ్రులు చింతల్లో నివసిస్తుంటారు. అయితే వరుస సెలవులు ఉండటంతో బాలుడిని హైదర్‌నగర్‌లోని వెర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. అది ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మరణించాడు. అయితే కొద్దిసేపటికి బాలుడు నీటిపై తేలుతూ గమనించాడు. చాలాసేపటి వరకు బాలుడు కనబడకపోవడంతో వెతుక్కుంటూ అక్కడకు వచ్చిన కుటుంబసభ్యులకు నీటిలో తేలుతూ కనిపించాడు. వెంటనే అర్జున్ను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతిచెందాడు.
బాలుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కనీసం వీకెండ్లో అయినా స్విమ్మింగ్ పూల్ వద్ద కేర్ టేకర్స్ లేకపోవడం, సీసీ కెమెరాల వద్ద పర్యవేక్షకులు లేకపోవడం వల్లే తన కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

