Bangladesh Board : భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Reshman)ను బీసీసీఐ తప్పించడాన్ని ఆ దేశ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఫిబ్రవరిలో జరుగబోయే ప్రపంచకప్ కోసం స్క్వాడ్‌ను ప్రకటించిన బంగ్లా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. వరల్డ్‌కప్ ఆడేందుకు తమ జట్టును ఇండియాకు పంపమని ఐసీసీకి ఈ-మెయిల్ చేసింది.
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం సమావేశమైన బంగ్లా బోర్డు సభ్యులు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడానికి ప్రతిచర్యగా కీలక ప్రకటన చేశారు. మెగా టోర్నీకి లిటన్ దాస్ సారథిగా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసిన తర్వాత.. భద్రతా కారణాలతో భారత్‌కు తమ జట్టును పంపమని బోర్డు వెల్లడించింది.
Bangladesh cricket board not to send team to India for T20 World Cup: Local Media
Read @ANI Story | https://t.co/neGcq9Vb0G #Bangladesh #T20WorldCup2026 #T20WC #t20wordcup pic.twitter.com/VXI4iOwxwV
— ANI Digital (@ani_digital) January 4, 2026
‘భద్రతా కారణాల రీత్యా మా జట్టును ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపించడం సాధ్యం కాదు. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. బీసీసీఐ నిర్ణయానికి కౌంటర్‌గా మేము ఈ తీర్మానం చేశాం. మా జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించండి’ అని బంగ్లా క్రికెట్ బోర్డు ఆదివారం ఐసీసీకి పంపిన ఈ-మెయిల్లో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలపడాలి. కానీ, ఇరుదేశాల బోర్డులు తమ ప్రభుత్వం మాటకే కట్టుబడి ఉన్నందున బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహిస్తారా? లేదా? రాజీకి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : లిటన్ కుమార్ దాస్(కెప్టెన్), మొహమ్మద్ సైఫ్ హొసేన్(వైస్ కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొసేన్, కాజీ నురుల్, మహేది హసన్, రిషద్ హొసేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, షైఫుద్దీన్, షొరిఫుల్ ఇస్లాం.
The Bangladesh Cricket Board (BCB) has decided that the national cricket team will not go to India to participate in the T20 World Cup.
[Link in Comments]#Bangladesh #BDCricket #T20WorldCup2026 #TBSNews pic.twitter.com/wd4YKSgwzU
— The Business Standard (@tbsnewsbd) January 4, 2026
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తున్న భారత ప్రభుత్వం.. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు బ్రేక్ వేసింది. అంతేకాదు బీసీసీఐ ఆదేశాల మేరకు తమ స్క్వాడ్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తప్పించింది. దాంతో.. బంగ్లాదేశ్ బోర్డు సైతం వరల్డ్‌కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపించమని మెలిక పెట్టింది. మొదట.. తమ ఆటగాళ్లు, మీడియా, స్పాన్సర్లకు భద్రత కల్పిస్తామని బీసీసీఐ హామీ ఇవ్వాలని బంగ్లా బోర్డు కోరనుందనే వార్తలు వినిపించాయి. కానీ, తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీకి ఆ దేశ బోర్డు రాయడం చర్చనీయాంశమవుతోంది.