ITF | హైదరాబాద్, ఆట ప్రతినిధి: కిగాలి(రువాండ) వేదికగా జరిగిన వరల్డ్ టూర్ టెన్నిస్ ఐటీఎఫ్ జూనియర్ సర్యూట్లో తెలంగాణ యువ ప్లేయర్ నూకల శాన్వితరెడ్డి ఆకట్టుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శాన్విత, లౌరా చనోవా(చెకోస్లోవియా) జోడీ 3-6, 1-6తో స్టెలా జిమోవిచ్, నేహా కృష్ణన్ ద్వయం చేతిలో ఓడి రన్నరప్ టైటిల్ దక్కించుకుంది.