ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త యాంథెమ్‌ను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ఈ పాట.. 2022 ఐపీఎల్ సీజన్ కోసం ప్రారంభించిన ‘‘ఖేలేంగే దిల్ ఖోల్కే’’ క్యాంపెయిన్‌కు కొనసాగింపుగా వచ్చింది. సోషల్ మీడియాలో విడుదల చేసిన రెండు నిమిషాల వీడియోలో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
తమ జట్టు ఎప్పుడూ ప్యాషన్‌తో ఆడిందని, తమ వెంట నిలిచిన అభిమానుల నమ్మకాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను స్వరపరిచామని ముంబై ఇండియన్స్ జట్టు ప్రతినిధి తెలిపారు. ఈ పాట విన్న అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తాజా ఐపీఎల్ సీజన్లో రెండు మ్యాచుల్లోనూ ఓడిన ముంబై జట్టు.. బుధవారం నాడు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
𝑴𝑰 𝒃𝒐𝒍𝒌𝒆…𝒌𝒉𝒆𝒍𝒆𝒏𝒈𝒆 #DilKholKe 💪😎
Paltan, make some noise for our boys in Blue & Gold as we present a धमाकेदार new song! 🤩💙#OneFamily #MumbaiIndians #TATAIPL pic.twitter.com/rtQclJ1vqs
— Mumbai Indians (@mipaltan) April 6, 2022