మదనాపురం, డిసెంబర్ 13 : స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో అధికారుల అండతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. శనివారం వనపర్తి జిల్లా గోపన్‌పేటలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా స్థానికులు అడ్డుకొన్నారు. కాంగ్రెస్ నేతలు ఓ ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు బయట తాళం వేశారు. పోలీసులు వచ్చి కాంగ్రెస్ నాయకులను విడిపించారు.
పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకోవాలని తొలుత అందరూ భావించగా, కాంగ్రెస్ నాయకులు ఓ అభ్యర్థిని బరిలో నిలిపారు. బీఆర్ఎస్ బలపరిచిన అంజనమ్మకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ కాంగ్రెస్ నేతలు డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు గురిచేశారు.