ఏటూరునాగారం, డిసెంబర్ 13 : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్లో ఉంటున్న వృద్ధుడు నూతి గౌరయ్య (80) చలి తీవ్రతను తట్టుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు.
వారం రోజులుగా చలి ఎక్కువగా ఉండగా, అనారోగ్యానికి గురై మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.