Maha kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా (Mahakumbh) విజయవంతంగా కొనసాగుతోంది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాలో భాగంగా గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తాజాగా ఈ కుంభమేళాలో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ధోనీ (MS Dhoni), కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ సహా పలువురు క్రికెటర్లు కాషాయ దుస్తుల్లో కుంభమేళాలో దర్శనమిచ్చారు. అయితే, వాళ్లు నిజంగా కుంభమేళాను దర్శించలేదు. ఇదంతా ఏఐ మాయ. ఈ ఫొటోలను టీమ్ ఇండియా మద్దతుదారుల బృందం ‘ది భారత్ ఆర్మీ’ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Samantha | పికిల్‌బాల్ మ్యాచ్‌లో సమంత సందడి.. అట్లీ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులు
Kabaddi Players: తమిళనాడు మహిళా కబడ్డీ ప్లేయర్లపై దాడి.. వీడియో
Abhishek Sharma: గాయపడ్డ అభిషేక్ శర్మ.. రెండో టీ20లో ఆడేది డౌటే !