బటిండా: పంజాబ్‌లోని బటిండాలో జరుగుతున్న ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో .. మహిళా కబడ్డీ ప్లేయర్లు(Kabaddi Players) ఘర్షణ పడ్డారు. తమిళనాడుకు చెందిన ప్లేయర్లపై అటాక్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మ్యాచ్ రిఫరీ ఇచ్చిన నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న ఆటగాళ్లు గొడవపడినట్లు తెలుస్తోంది. బటిండాలో నార్త్ జోన్ ఇంటర్ యూనివర్సిటీతో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ మహిళల చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో మదర్ థెరిసా యూనివర్సిటీ, పెరియార్ యూనివర్సిటీ, అలగప్ప యూనివర్సిటీ, భారతీయార్ వర్సిటీలు పాల్గొంటున్నాయి.
ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య గొడవ ప్రారంభమైనట్లు తొలుత నివేదిక వచ్చింది. మదర్ థెరిసా యూనివర్సిటీ, దర్బంగా యూనివర్సిటీ మధ్య మ్యాచ్‌లో ఘర్షణ జరిగింది. కబడ్డీ మ్యాచ్ రిఫరీ ఒకరు.. మదర్ థెరిసా జట్టు ప్లేయర్‌పై అటాక్ చేశారు. ఫౌల్ అటాక్‌కు సంబంధించి వాగ్వాదం జరిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. కొందరు పురుషులతో మహిళలు గొడవకు దిగుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే వాళ్లు అధికారులు లేక ప్రేక్షకులా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు చైర్స్ విసురుకున్నారు. తమిళనాడు మహిళా కబడ్డీ ప్లేయర్లు క్షేమంగా ఉన్నారని, వాళ్లు త్వరలో రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ఎవరికీ ఏమీకాలేదని, వాళ్లు ఢిల్లీలోని తమిళనాడు హౌజ్‌కు చేరుకున్నారని, త్వరలో తమిళనాడు రానున్నట్లు చెప్పారు.
It is shocking that Tamil Nadu women players who went to play Kabaddi in Punjab were attacked. The attack took place during a Kabadi match between Punjab and Tamil Nadu. I urge the Punjab Chief Minister Bhagwant Mann ji to take appropriate enquiry and action on attackers.… pic.twitter.com/vIZrG0EsVn
— Devakumaar (@DevakumaarOffcl) January 24, 2025