చెన్నై: భారత క్రికెటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడ్డాడు. దీంతో అతను చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా ఉన్నది. నెట్స్‌లో శుక్రవారం క్యాచింగ్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు. అభిషేక్ శర్మ మడిమ ట్విస్ట్ అయ్యింది. దీంతో అతను తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఫీల్డ్ వద్ద ఉన్న టీం ఫిజియో అతన్ని చెక్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. నడుస్తున్న సమయంలో అతను ఇబ్బందిపడినట్లు కనిపించింది. నెట్స్‌లో ఆ తర్వాత అతను బ్యాటింగ్ కూడా చేయలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే సుమారు అరగంట పాటు ఫిజియోతో గడిపాడు అభిషేక్.
కోల్‌కతాలో జరిగిన ఫస్ట్ టీ20లో అభిషేక్ శరవేగంగా 79 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒకవేళ శనివారం జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడలేని పక్షంలో .. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా ద్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ అభిషేక్ మిస్స్ అయితే, అప్పుడు తిలక్ వర్మ ఓపెనర్ బాధ్యతలు చేపట్టే ఛాన్సు ఉన్నది. అతను సంజూ శాంసన్‌తో కలిసి ఓపెన్ చేస్తాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్నది.