Samantha | ‘వరల్డ్ పికిల్ బాల్ లీగ్’ (World Pickleball League) తమిళనాడు చెన్నైలో శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌లో టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) సందడి చేశారు. చెన్నై ఫ్రాంచైజీని సామ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభం సందర్భంగా తన జట్టుకు మద్దతుగా పాల్గొన్నారు. సామ్‌తోపాటు స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) సైతం తన ఫ్యామిలీతో సందడి చేశారు. ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై సూపర్ ఛాంప్స్ (Chennai Super Champs) ఫ్రాంచైజీని సమంత కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం తన జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని కూడా లాంఛ్ చేశారు. చెన్నైలోని సత్యభామ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ లో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించి ఈ జెర్సీని విడుదల చేశారు. రెడ్, ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ జెర్సీని డిజైన్ చేశారు.
పికిల్‌బాల్ గేమ్ 1965లో అమెరికాలో మొదలైంది. ఇప్పుడిప్పుడే ఈ ఆటకు మన దగ్గరా ఆదరణ దక్కుతోంది. అంతర్జాతీయంగా ఈ గేమ్ లో పెద్ద టోర్నీలే నిర్వహిస్తారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుందీ ఈ పికిల్‌బాల్ గేమ్. ఇండోర్ లేదా అవుట్‌డోర్‌లో ఈ గేమ్‌ను ఆడొచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు కలిసి ఆడతారు. మిక్స్డ్ డబుల్స్‌లోనూ పోటీలు జరుగుతుంటాయి. ఆటలో హార్డ్ ప్లాస్టిక్ బాల్, చెక్కతో చేసిన పాడిల్‌ను ఉపయోగిస్తారు.
Samantha Ruth Prabhu and Varalaxmi Sarathkumar 🧡🥰#Samantha #SamanthaRuthPrabhu #Varalaxmi #VaralaxmiSarathkumar pic.twitter.com/FR6V2VhavJ
— WV – Media (@wvmediaa) January 25, 2025
Also Read..
Thalapathy Vijay | దళపతి విజయ్ ఆఖరి సినిమా.. రేపటి తీర్పు!
Payal Rajput | పగ తీర్చుకునే వెంకటలచ్చిమి.. పాయల్ రాజ్‌పుత్ పాన్ ఇండియా మూవీ
Janhvi Kapoor | ముగ్గురు పిల్లల్ని కని.. భర్తతో కలిసి తిరుపతిలో సెటిల్ అవుతా: జాన్వీకపూర్