Thalapathy Vijay | దళపతి విజయ్ ఆఖరి సినిమా.. రేపటి తీర్పు!
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ప్రస్తుతం తన 69వ చిత్రంలో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకుడు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకోవడంతో తన కెరీర్లో ఇదే ఆఖరి చిత్రమని విజయ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా కోసం తమిళనాట ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Thalapathy Vijay | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ప్రస్తుతం తన 69వ చిత్రంలో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకుడు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకోవడంతో తన కెరీర్లో ఇదే ఆఖరి చిత్రమని విజయ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా కోసం తమిళనాట ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘నాలైయ తీర్పు’ (తెలుగులో ‘రేపటి తీర్పు’ అని అర్థం) అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది. విజయ్ తొలి సినిమా పేరు కూడా ఇదే కావడం విశేషం. తన తండ్రి యస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘నాలైయ తీర్పు’ అనే చిత్రం ద్వారా విజయ్ హీరోగా అరంగేట్రం చేశారు.
ఆయన చివరి చిత్రానికి కూడా ఇదే పేరు ఖరారు చేసే అవకాశం ఉండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న దృష్ట్యా సింబాలిక్‌గా ఈ టైటిల్ బాగా సెట్ అవుతుందని విజయ్ అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దళపతి విజయ్ గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, రాజకీయ పార్టీ స్థాపనకు దారి తీసిన సంఘటనలను ప్రధానాంశాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

