IND vs ENG : బర్మింగ్హమ్ టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం చేసింది. ఆద్యంతం ఇంగ్లండ్‌పై పైచేయి సాధిస్తూ వచ్చిన టీమిండియాకు ఆకాశ్ దీప్ (Akash Deep) గెలుపు గుర్రమయ్యాడు. ఇన్‌స్వింగర్‌తో డేంజరస్ జో రూట్ (Joe Root)ను ఆకాశ్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్. అతడి వికెట్‌తో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. అయితే.. రూట్ వికెట్‌పై మీడియాలో రాద్దాంతం మొదలైంది. ఆకాశ్ నో బాల్ వేశాడని, అసలు రూట్ ఔటే కాదనే చర్చ ఊపందుకుంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు కూడా అవునంటూ గొంతుకలిపారు. సోషల్ మీడియాలో ముదురుతున్న ఈ వివాదంలో అర్థం లేదని పేర్కొన్న మెరిలెబొనే క్రికెట్ క్లబ్ (MCC) .. ఆకాశ్ వేసిన బంతి సరైనదేనని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే.. ఐదో రోజు తొలి సెషన్ పదో ఓవర్లో ఆకాశ్ సంధించిన రెండో బంతిని అడ్డుకోలేక రూట్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇన్‌స్వింగ్ అయిన బాల్ వికెట్లను గిరాటేయడంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. కానీ, ఆ తర్వాత ఫుటేజ్‌లో ఆకాశ్ కాలు క్రీజులోని వెనక గీతకు అవతల ఉన్నట్టు కనిపించింది. దాంతో, అది బ్యాక్ ఫుట్ నో బాల్ అని, అంపైర్ గుర్తించకపోవడం వల్ల రూట్ బలయ్యాడని వార్తలు వైరలయ్యాయి.
Undoubtedly, the best ball of this series by Akash Deep 👏🏻
~ No.1 Test Batter Joe Root have no Clue whatsoever 😲 #INDvsENG pic.twitter.com/wNgxALU6ym
— Richard Kettleborough (@RichKettle07) July 6, 2025
ఈ విషయంపై ఎంసీసీ స్పందిస్తూ ఆకాశ్ సరైన బంతినే వేశాడని అంది. ‘బర్మింగ్హమ్ టెస్టులో రూట్‌ను బౌల్డ్ చేసిన ఆకాశ్ బంతిని సంధించే సమయంలో అతడి బ్యాక్ ఫుట్ అవతలి లైన్ మీదే ఉంది. అతడు బంతిని విసిరేసే క్రమంలో మిగతా పాదం లైన్‌కు కొద్దిగా తాకి ఉంటుంది. అలా అనీ దాన్ని నో బాల్ అనలేం. క్రికెట్ సూత్రాల ప్రకారం చూసినా కూడా అది బ్యాక్‌ఫుట్ నో బాల్ కానే కాదు’ అని వెల్లడించింది. రూట్ వికెట్‌పై మీడియాలో వస్తున్న కథనాల భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా కొట్టిపారేశాడు. అది కచ్చితంగాది లీగల్ డెలివరే అని తేల్చి పడేశాడు శాస్త్రి. థర్డ్ అంపైర్ పాల్ రీఫెల్ సైతం ఆకాశ్ వేసింది సరైన బంతేనని చెప్పాడు. ఇప్పుడు ఎంసీసీ కూడా వివరణ ఇవ్వడంతో రూట్ వికెట్‌పై నెలకొన్న అనవసర వివాదం సమసిపోయింది.
A performance to remember from Akash Deep 👏#WTC27 #ENGvIND pic.twitter.com/xtQppfxnYY
— ICC (@ICC) July 7, 2025
భారత్ నిర్దేశించిన 608 పరుగుల చేధనలో ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు కుదేలయ్యారు. నాలుగో రోజే రెండు వికెట్లుతో ఆ జట్టును ఆత్మరక్షణలో పడేసిన ఆకాశ్.. ఐదో రోజు ఇంకా చెలరేగాడు. నిప్పులు చెరిగే బంతులతో రూట్, బ్రూక్‌లను పెవిలియన్ పంపి భారత్‌ను గెలుపు వాకిట నిలిపాడు. ఆఖరి వికెట్‌గా కార్సేను డగౌట్ చేర్చిన ఆకాశ్ (6-99)కెరియర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో గిల్ సేన విజయంలో భాగమయ్యాడు.